Air India: ముంబై- న్యూయార్క్ విమానానికి బెదిరింపులు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Shamantha N |
Air India: ముంబై- న్యూయార్క్ విమానానికి బెదిరింపులు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని న్యూఢిల్లీకి మళ్లించారు. 239 మందితో న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా ఫ్లైట్ ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులోనుంచి ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం ముంబై నుంచి న్యూయార్క్ లోని జేఎఫ్ కే విమానాశ్రయానికి వెళ్లాల్సిన AI119 ఫ్లైట్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఫ్లైట్ ని ఢిల్లీకి మళ్లించారు. ఫ్లైట్ లో ఉన్న ప్రయాణీకులందరూ ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్‌లో వేచి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

ఐసోలేషన్ రన్ వే పై విమానం

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఐసోలేషన్ రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో సహా భద్రతా సంస్థలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. విమానంలోని వ్యక్తులందరి భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇకపోతే, ఈ ఘటనపై ఎయిరిండియా ఇంకా మరిన్ని వివరాలను అందించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయ అధికారులు భద్రతాసిబ్బందితో కలిసి పనిచేస్తున్నారు. ప్రయాణికులు, సిబ్బంది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎయిర్ పోర్టులోనే ఉండనున్నారు.

Advertisement

Next Story

Most Viewed