NEET ROW: ముందే పేపర్ లీకేజీ జరగొచ్చు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2024-07-22 15:30:16.0  )
NEET ROW: ముందే పేపర్ లీకేజీ జరగొచ్చు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌-యూజీ 2024 (NEET-UG 2024) పరీక్ష పత్రం లీకేజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసందర్భంగా నిందితులకు మే4వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే.. లీక్‌ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ అనుమానం వ్యక్తంచేశారు. అలా అయితే.. స్ట్రాంగ్‌ రూమ్‌ వాలెట్‌లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా?.. అని ప్రశ్నించారు. బిహార్‌ పోలీసుల దర్యాప్తు రిపోర్టును ప్రస్తావిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 161 వాంగ్మూలాలు పేపర్‌ లీక్‌ మే 4వ తేదీ కంటే ముందే చోటుచేసుకొందని బలంగా చెబుతున్నట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. బిహార్‌ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత ప్రాంతల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్‌ చేయటానికి ముందే లీకైందని తెలిపారు. కచ్చితంగా ఓ గ్యాంగ్‌ ఎప్పటినుంచో ఈ పని చేస్తోందని పేర్కొన్నారు. సంజీవ్‌ ముఖియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకచోట ప్రశ్నపత్రాన్ని రిక్షాలో కూడా తరలించారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు

సుప్రీంకోర్టులో పిటిషన్లు

కాగా.. నీట్‌-యూజీ 2024కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం విచారణ చేపడుతోంది. ఇందులో నీట్‌కు సంబంధించిన 40 పిటిషన్లు ఉన్నాయి. వీటిల్లో వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్‌టీఏ అభ్యర్థన కూడా ఉంది.

Read More..

Current Shock: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి..

Advertisement

Next Story

Most Viewed