South Africa: కరువుతో కొట్టుమిట్టాడుతున్న 68 మిలియన్ల మంది

by Shamantha N |
South Africa: కరువుతో కొట్టుమిట్టాడుతున్న 68 మిలియన్ల మంది
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణాఫ్రికాలో దాదాపు 68 మిలియన్ల(6.8 కోట్ల మంది) మంది ప్రజలు కరువుల వల్ల కొట్టుమిట్టాడుతున్నారని సదరన్ ఆఫ్రికన్ డెవలప్ మెంట్ కమ్యూనిటీ(SADC) తెలిపింది. 16 దేశాల సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ (SADC) దేశాధినేతలు జింబాబ్వే రాజధాని హరారేలో సమావేశమయ్యారు. ఆహార భద్రతతో సహా ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. ఎల్‌ నినో వల్ల కరువు ఏర్పడిందని.. పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయని ఎస్ఏడీసీ వెల్లడించింది. 2024 ప్రారంభంలో కరువు వచ్చిందని.. దీని వల్ల పంట, పశువుల ఉత్పత్తి దెబ్బతిందని పేర్కొంది. ఆహార కొరత వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొంది. దాదాపు 68 మిలియన్ల మందికి సహాయం అవసరమని ఎస్ఏడీసీ సెక్రటరీ ఎలియాస్ మాగోసి తెలిపారు.

విరాళాలు కోరిన లెసోతో, నమీబియా

ఎల్ నినో వల్ల దక్షిణాఫ్రికాలో తీవ్ర కరువు ఏర్పడిందని ఎస్ఏడీసీ పేర్కొంది. జింబాబ్వే, జాంబియా, మలావితో సహా పలు దేశాలు ఇప్పటికే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి. లెసోతో, నమీబియా మానవతా మద్దతు కోసం పిలుపునిచ్చాయి. 5.5 బిలియన్ల మానవతా సాయం కోసం అభ్యర్థించినప్పటికీ.. ఇప్పటికీ విరాళాలు అందలేదని అంగోలా ప్రెసిడెంట్ చైర్ జోయా లారెన్సో అన్నారు. విరాళాలు చాలా తక్కువగా వచ్చాయని.. ఎల్ నినో బారిన పడిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed