- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ మార్పుపై స్పందించిన ఎన్సీపీ నేత
ముంబై: పార్టీ మారుతారనే కథనాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరట్లేదని చెప్పారు. మీడియా ఏ కారణం లేకుండానే పుకార్లను వ్యాప్తి చేస్తుందని చెప్పారు. పార్టీ మారబోతున్నాననే రూమర్లో ఎలాంటి నిజం లేదు. ఎన్సీపీతోనే నేను కొనసాగుతాను అని అజిత్ స్పష్టం చేశారు. ఈ వార్తలతో ఎన్సీపీ వర్కర్లు గందరగోళానికి గురవుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం అన్నారు. వారు ఎలాంటి ఆందోళన చెందొద్దని, ఎన్సీపీ శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటైందని చెప్పారు. గతంలో తాము అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు తాను ఎవ్వరి సంతకాల సేకరణ చేయలేదని కూడా స్పష్టతనిచ్చారు.
మరోవైపు ఈ నివేదికలన్ని తప్పని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా కొట్టివేశారు. అజిత్ పవార్ ఏ సమావేశానికి పిలుపునివ్వలేదని, పార్టీతో కొనసాగుతున్నారని చెప్పారు. కాగా అంతకుముందు పవార్ కూతురు సుప్రియా సూలె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రెండు పెద్ద కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని బాంబ్ పేల్చారు. ఈ క్రమంలో అజిత్ పవార్ పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. అయితే అజిత్ పవార్ ప్రకటనతో గందరగోళానికి తెరపడింది.