యూట్యూబ్‌కు ‘ఎన్‌సీపీసీఆర్’ సమన్లు

by samatah |
యూట్యూబ్‌కు ‘ఎన్‌సీపీసీఆర్’ సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: యూట్యూబ్ ఇండియాకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) సమన్లు జారీ చేసింది. తల్లి, కుమారులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ యూట్యూబ్‌లో వస్తుందని తెలిపింది. దీనిపై జనవరి 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో.. యూట్యూబ్ ఇండియా ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెచ్ మీరా చాట్‌కు లేఖ రాశారు. కొన్ని చానెళ్లలో తల్లి, కొడుకులకు చెందిన అసభ్యకర కంటెంట్‌ను కమిషన్ గుర్తించినట్టు పేర్కొన్నారు. అనేక వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012ను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఇది ఆందోళ కలిగించే అంశమని.. యూట్యూబ్ ఈ సమస్యని పరిష్కరించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై తమ ఎదుట వ్యక్తి గతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed