నాగాలాండ్‌లో సరికొత్త చరిత్ర.. అసెంబ్లీకి తొలి మహిళ..

by Vinod kumar |
నాగాలాండ్‌లో సరికొత్త చరిత్ర.. అసెంబ్లీకి తొలి మహిళ..
X

దిశ, వెబ్‌డెస్క్:మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయలో ఎన్నికల కౌంటింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించగా.. ఓ మహిళ నాగాలాండ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 60 ఏళ్ల తర్వాత నాగాలాండ్‌లో ఓ మహిళ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అభ్యర్థి హెకానీ జఖాలు విజయం సాదించారు. దిమాపూర్-III నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు విజయం సాధించారు.

దీంతో నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ గెలుపొందడం ఇదే తొలిసారి. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికైన తొలి మహిళగా.. హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. ఇక నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. అందులో ఓ న్యాయవాది, ఓ సామాజిక కార్యకర్త ఉన్నారు. 60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా దక్కింది. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినా.. ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. రాష్ట్రంలో మొత్తం 13.17 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు. అయినా కూడా ఇప్పటివరకు అక్కడ ఒక్క మహిళా విజయం సాధించలేదు.

Advertisement

Next Story