శరద్ పవార్‌కు మరో షాక్.. ఆ ఏడుగురిపై అనర్హతకు స్పీకర్ నో

by Hajipasha |
శరద్ పవార్‌కు మరో షాక్.. ఆ ఏడుగురిపై అనర్హతకు స్పీకర్ నో
X

దిశ, నేషనల్ బ్యూరో : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు మరో షాక్ తగిలింది. ఎన్‌సీపీకి నాగాలాండ్ రాష్ట్రంలోనూ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరంతా శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్‌‌తో గతేడాది జులైలోనే చేతులు కలిపారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు అందరిపై అనర్హత వేటు వేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ స్పీకర్‌ షరీన్‌గైన్ లాంగ్‌కుమర్‌కు శరద్ పవార్‌ ఎన్‌సీపీ వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తోసిపుచ్చారు. నిజమైన ఎన్‌సీపీ అజిత్ పవార్‌ వర్గానిదే అని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించినందున.. ఆయన వెంట ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించలేమని స్పీకర్ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed