- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మణిపూర్‌లో హింసకు మయన్మార్‌లో పథక రచన.. ఎన్‌ఐఏ సంచలన ఛార్జిషీట్
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ లో హింసకు మయన్మార్ లో ప్లానింగ్ జరిగినట్లు తెలిపింది ఎన్ఐఏ. గతేడాది మణిపూర్ లో జాతుల మధ్య వైరం చెలరేగింది. అయితే జాతి హింసలో పాల్గొనేందుకు యువకులకు తుపాకుల శిక్షణ ఇచ్చారని పేర్కొంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
మెయితీ వర్గానికి చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థలు కేవైకేఎల్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలకు చైనా -మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహించే ఎన్ఎస్‌సీఎన్ (ఐఎం) సంస్థ ఆయుధాలను సప్లై చేసింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఇతర సామగ్రిని అందించింది. ఈ మేరకు మార్చిన 27న అసోం రాజధాని గౌహతిలోని కోర్టుకు ఇచ్చిన ఛార్జిషీట్ లో పేర్కొంది.
మణిపూర్‌లో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు మయన్మార్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు పన్నిన కుట్రే జాతుల మధ్య ఘర్షణ అని ఎన్ఐఏ పేర్కొంది. మయన్మార్ హస్తం గురించి కేంద్రానికి సమాచారం అందించింది ఎన్ఐఏ. కేవైకేఎల్, పీఎల్ఏలకు ఎన్ఎస్సీఎన్ఐ(ఎం) ఆయుధాలు, పేలుడు పదార్థాలు సురక్షితంగా తరలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. మయన్మార్‌కు చెందిన వారికి "సారవంతమైన భూములు" అందించి.. ఉగ్రసంస్థలు దోపిడీకి పాల్పడ్డారని వివరించింది.
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో కుకీ- జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది ఎన్ఐఏ. వారిని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని ఛార్జిషీటులో స్పష్టం చేసింది.