Yogi Adityanath: పదిరోజుల్లో రాజీనామా చేయకుంటే చంపేస్తాం.. యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు

by Shamantha N |
Yogi Adityanath: పదిరోజుల్లో రాజీనామా చేయకుంటే చంపేస్తాం.. యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌(Uttar Pradesh Chief Minister Yogi Adityanath) ను హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. బాబా సిద్ధిఖీలా యోగిని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. ‘‘బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం. ఆయన పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అని దుండగులు ఆ మెసేజ్ లో డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఈ మెసేజ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. థ్రెటింగ్ మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో, యోగికి భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాబా సిద్ధిఖీ హత్య

గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ పవార్‌ వర్గం నేత బాబా సిద్ధిఖీని(Baba Siddique) లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌తో సన్నిహితంగా ఉన్నందుకే చంపామని నిందితులు చెప్పారు. ఆ తర్వాత నుంచి పలువురికి లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జిషాన్ కూడా హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడికి కూడా బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా, గత రెండు వారాల్లో 500 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీనివల్ల విమానయాన సంస్థలకు కార్యాచరణ సమస్యలు తలెత్తాయి. బెదిరింపులను భద్రతా సంస్థలు "బూటకం"గా ప్రకటించాయి. థ్రెటింగ్ మెసేజ్ లు అన్నీ సోషల్ మీడియా ద్వారానే వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed