- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Mumbai airport: ముంబై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ముంబై విమానాశ్రయంలో 4.525 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న విమానంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద టైలర్ మేడ్ జాకెట్ పాకెట్స్‌లో దాచిన బంగారాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.3.33కోట్లు ఉంటుందని తెలిపారు. బంగారాన్నీ సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అంతకుముందు జూలైలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.10.33 కోట్ల విలువైన 13.24 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.