ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

by Aamani |   ( Updated:2023-11-24 08:59:51.0  )
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
X

ముంబై: అత్యంత రద్దీగా ఉండే మహారాష్ట్ర ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ కలకలం రావడం రేపింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామని ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది, పేలుడు సంభవించకుండా ఉండేందుకు బిట్‌కాయిన్‌ల రూపంలో ఒక మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. 48 గంటల్లోగా అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2పై బాంబు దాడి చేస్తామని, 24 గంటలు గడించిన తర్వాత మరో మెయిల్ పంపనున్నట్టు అగంతకులు హెచ్చరించారు. బెదిరింపు మెయిల్ గురించి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story