- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీకి మరో జీవితఖైదు
దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న ఉత్తరప్రదేశ్ సీనియర్ రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి 36 ఏళ్ల కిందటి ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. 1987 నాటి నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ఆయనకు వారణాసిలోని స్పెషల్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ కేసులో అన్సారీ దోషి అని మంగళవారమే కోర్టు నిర్ధారించింది. అయితే బుధవారం శిక్షను అనౌన్స్ చేసింది. ఈ కేసు విచారణకు ముఖ్తార్ అన్సారీ బాండా నగరంలోని జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అసలు ఈ కేసు ఏమిటంటే.. 1987 జూన్ 10న ముఖ్తార్ అన్సారీ డబుల్ బ్యారెల్ గన్ లైసెన్స్ కోసం ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌ల నకిలీ సంతకాలతో ఆయుధాల లైసెన్స్‌ను పొందారు. ఈ మోసపూరిత వ్యవహారం 1990 డిసెంబరు 4నే బయటపడింది. అప్పట్లో దీనిపై అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా సీబీ సీఐడీ పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా ముఖ్తార్ అన్సారీ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. ఎట్టకేలకు దానిపై 34 ఏళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అన్సారీపై దాదాపు 60 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు ఏడు కేసుల్లో ముఖ్తార్ అన్సారీ దోషిగా తేలాడు.