కాబోయే భార్యపై ముఖేశ్ అంబానీ కొడుకు కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
కాబోయే భార్యపై ముఖేశ్ అంబానీ కొడుకు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మార్చి 1,2,3 తేదీలల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే పెళ్లి కోసం ఊహించని రేంజ్‌లో ఏర్పాట్లు చేశారు. వంటల విషయానికి వస్తే.. 100 కాదు, 200 కాదు.. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. ఇందుకోసం దేశం నలువైపుల నుండి ప్రత్యేకంగా 25 నుండి 30 మంది బెస్ట్ షెఫ్ లను నియమించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పెళ్లిపై, కాబోయే భార్యపై వరుడు(అనంత్) కీలక వ్యాఖ్యలు చేశారు. రాధిక తనకు భార్యగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణలో నిమగ్నమైన నేను పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. కానీ, రాధికను కలిశాక ఆమె కూడా నాలాగే ఆలోచిస్తుందని అర్థం అయింది. నా లాగే తనకూ జంతువులు అంటే ప్రాణం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరోవైపు పెళ్లికి ముందు కోడలు రాధికకు ముఖేశ్ అంబానీ విలువైన బహుమతులు ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story