పుల్వామా దాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: MP

by GSrikanth |
పుల్వామా దాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: MP
X

దిశ, తెలంగాణ బ్యూరో: పుల్వామా దాడి కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగిందని ఎంపీ గౌరవ్​గోగోయ్​అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. భద్రత బలగాలకు అవసరమైన విమానాలు ఇవ్వకపోవడం వలనే దాడి జరిగిందన్నారు. భద్రత బలగాల రవాణకు విమానం కోసం చేసిన అభ్యర్థనలను కూడా కేంద్రం తిరస్కరించిందన్నారు. అందుకు పౌర విమానయాన శాఖ వద్ద ఆధారాలూ ఉన్నాయన్నారు. అంతేగాక 2జనవరి 2019, 3 ఫిబ్రవరి 2019 మధ్య, జైష్-ఏ-మహ్మద్ దాడి సూచిస్తూ కనీసం 11 ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు అందాయని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు.

ఏదైనా పెద్ద కాన్వాయ్ కదులుతున్నప్పుడు, ఆ రూట్‌లో యాంటీ ఐఈడీ జామ్‌లు ముందుగా కదులుతాయని, కానీ సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ వెళ్లేక్రమంలో ఇవేమీ కనిపించలేదన్నారు. పైగా లింక్ రోడ్లు కూడా మూయలేదన్నారు. ఇది పక్కా ప్రభుత్వ లోపమే అన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. పైగా నిజాలు వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి, సత్యపాల్ మాలిక్​ పై కేంద్ర కుట్రపూరిత చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంటీ టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed