- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాలూ భార్య, కూతుళ్లపై ఈడీ ఛార్జ్‌షీట్.. ఏ కేసు ?
దిశ, నేషనల్ బ్యూరో : ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుటుంబం చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. దీనితో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో తాజాగా మంగళవారం లాలూ భార్య రాబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఎ) కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌ను సమర్పించింది. దీనిపై కోర్టు జనవరి 16న విచారణ చేపట్టనుంది. 4,751 పేజీల ఈ ఛార్జిషీట్‌లో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుటుంబానికి సన్నిహితుడైన అమిత్ కత్యాల్‌తో పాటు ఇతర వ్యక్తులు, కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబరులోనే కత్యాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అమిత్ కత్యాల్‌పై ఈడీ విచారణను రద్దు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ ఏమిటి?
కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు హయాంలో లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్యకాలంలో రైల్వే ఉద్యోగాలను బిహార్‌కు చెందిన పలువురు యువతకు ఇప్పించినందుకు ప్రతిఫలంగా వారి భూమిని కారుచౌక ధరలకు లాలూ కుటుంబీకులు తీసుకున్నారు. గతంలో దీనిపై విచారించిన సీబీఐ.. లాలూ హయాంలో రైల్వే రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని తేల్చింది.