మోడీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు

by samatah |
మోడీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు: రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోడీ దేశంలో అవినీతి పాఠశాల నడుతుపున్నారు. ఆ స్కూల్‌లో ‘పూర్తి అవినితి సైన్స్’ అనే సబ్జెక్ట్ భోదిస్తున్నారు. విరాళం వ్యాపారం సహా ప్రతి అంశాన్ని మోడీ స్వయంగా వివరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘దాడులు చేసి విరాళాలు ఎలా సేకరించాలి? ఆ తర్వాత కాంట్రాక్టులు ఎలా పంపిణీ చేయాలి? దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై ఎలా దాడులు చేయించాలి? అనే విషయాలపై పాఠాలు నేర్పుతున్నారు’ అని తెలిపారు.

బీజేపీ తమ నాయకులకు ఈ కోర్సును నేర్చుకోవడం తప్పనిసరి చేసిందని వెల్లడించారు. ఈ చర్యలకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. అవినీతిపరులను ఉతికి ఆరేసే వాషింగ్ మెషీన్ ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి బెయిల్-జైల్ అనే ఆట ఆడుతోందని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోర్సును శాశ్వతంగా మూసి వేస్తుందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ పథకమని మరోసారి అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed