- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు..ఏమైంది?' ఖర్గే విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలు, విధానాలను ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మోడీ వాగ్దానాలు చేశారంటూ బీజేపీ చేసిన ‘మోదీ హై తో ముమ్కిన్ హై’ నినాదంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. దేశంలోని యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. మోడీ వస్తే దేశానికి మేలు జరుగుతుందని చెప్పే బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా మండుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, గోధుమల ధరల గురించి ఏం మాట్లాడతారని అన్నారు. ప్రగతి, అభివృద్ధి అంటూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వాదనల విశ్వసనీయతను ఆయన సవాల్ చేశారు. మోడీ హయాంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం వారిని తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగాలిచ్చేస్తున్నామని ఆకాశానికెత్తిన మోడీ ఆ తర్వాత ఉపాధి కల్పననే విస్మరించారని, దీనిపై బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఖర్గె ఆరోపణలు చేశారు.