మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..నోరు జారిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

by samatah |
మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..నోరు జారిన బిహార్ సీఎం నితీశ్ కుమార్
X

దిశ, నేషనల్ బ్యూరో: జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ నోరు జారారు. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ..మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘దేశ వ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని కోరుకుంటున్నాం. మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు భారత్‌తో పాటు బిహార్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ అనుకున్నట్టుగా జరుగుతుంది’ అని తెలిపారు. దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. అనంతరం మళ్లీ తన తప్పును సరిదిద్దుకున్నారు. నరేంద్ర మోడీ ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారని, అలాగే ముందుకు సాగుతారని తెలిపారు. అదే నేను కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, నితీశ్ గతంలోనూ పలు మార్లు నోరు జారిన విషయం తెలిసిందే. 2020లో మరణించిన బిహార్‌కు చెందిన రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ఓట్లు వేయాలని ఆయన ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల్లోనే మరోసారి నోరు జారడం గమనార్హం.

Advertisement

Next Story