- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మోడీ కా పరివార్' దుమారం.. జశోదాబెన్ ఫోటోతో మోడీకి కౌంటర్.. 2019 సీన్ రిపీట్?
దిశ, డైనమిక్ బ్యూరో:దేశవ్యాప్తంగా 'మోడీ కా పరివార్' టాపిక్ పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ప్రధానికి కుటుంబం లేదని అందుకే ఆయన వారసత్వ, కుటుంబ రాజకీయలపై విమర్శలు చేస్తున్నారని నిన్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పర్యటనలో ప్రధాని రియాక్ట్ అయ్యారు. తాను ఓ లక్ష్యం కోసం ఇంటిని వదిలి బయలుదేరానని 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబ సభ్యులే (మోడీ కా పరివార్) అంటూ ఆదిలాబాద్ సభలో మోడీ వ్యాక్యానించారు. దీంతో బీజేపీ నేతలంతా తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో మోడీ కా పరివార్ అనే ట్యాగ్ లైన్ జోడించుకుని మోడీకి మద్దతుగా నిలిచారు. పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ వంటి జాతీయ నేతలతో పాటు ఆయా రాష్ట్రాస్థాయి నేతలు, మోడీ అభిమానులు సైతం తమ ఖాతాల్లో ఈ మార్పు చేయడంతో ఒక్కసారిగా ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే దీనిపై కాంట్రెస్, ప్రతిపక్షాలు అంతే ధీటుగా కౌంటర్లు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
తెరపైకి జస్టిస్ ఫర్ జశోదాబెన్:
మోడీ కా పరివార్ అంటే దేశ ప్రజలు కాదని అదానీతో పాటు బీజేపీలోని వివాదాస్పద వ్యక్తులే మోడీకా అసలీ పరివార్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ.. మోదీ కా పరివార్‌లో మణిపూర్ మహిళలకు చోటు దక్కుతుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ప్రధాని తన పరివారే అని అంటారా? ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగ యువత గురించి వారిని ప్రధానమంత్రి తన పరివార్ అని ఎందుకు పిలవరని నిలదీశారు.ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి సన్నిహితుల కోసం మాత్రమే పని చేస్తోందని, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని కాపాడుతుంది.అవినీతిపరులుగా ముద్రపడిన నాయకులను చేర్చుకుంటోందని విమర్శించారు. ఇక మరి కొంత మంది మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ గా మోడీ సతీమణి జశోదాబెన్ కు సంబంధించిన ఓ ఫేక్ ఫోటోను షేర్ చేస్తున్నారు. జశోదాబెన్ చేతిలో మోడీకా పరివార్, జస్టిస్ ఫర్ జశోదాబెన్ అనే యాష్ ట్యాగ్ తో రాసిఉన్న ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
2019 సీన్ రిపీట్!:
త్వరలో ఎంపీ ఎన్నికలు జరగనుండగా ఇంతలో మోడీకా పరివార్ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం చర్చగా మారింది. 2019 ఎన్నికల సమయంలోనూ బీజేపీ నేతలు ఇదే రీతిలో స్పందించారని ఇప్పుడు ఆదే సీన్ రిపీట్ అవుతోందనే చర్చ జరుగుతోంది. 2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఉద్దేశించి 'కాపలాదారు ఓ దొంగ' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా దానికి కౌంటర్ గా బీజేపీ నేతలంతా మై బీ చౌకీదార్(మేం కూడా కాపలాదారులం) అంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు చేశారు. తాజాగా ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో ఈ అంశంలో దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.