మోడీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన నియంత: సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు

by samatah |
మోడీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన నియంత: సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన నియంత అని అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నియంత కంటే సంకీర్ణ ప్రభుత్వం ఎంతో మంచిదని తెలిపారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అవుతారని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పీఎంను ఎన్నుకోవడంలో ఇండియా కూటమికి ప్రత్యేక హక్కు ఉందని తెలిపారు. ఏడాదిలో ఇద్దరు లేదా నలుగురు ప్రధానులను కూడా చేస్తామని అది తమ ఇష్టం అని స్పష్టం చేశారు. కానీ దేశాన్ని మాత్రం నియంతృత్వం వైపు వెళ్లనివ్వబోమని వెల్లడించారు. దేశాన్ని పదేళ్లుగా నియంత పాలిస్తున్నాడని ఆరోపించారు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి నాయకులు ప్రజలకు ఓటు వేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. మోడీకి విజయంపై నమ్మకం ఉంటే ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లోనూ బీజేపీ దారుణంగా విఫలమైందని తెలిపారు. ఇండియా కూటమి 300సీట్లకు పైగా గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story