- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ అప్పటి వరకు ఆగాల్సిన పనిలేదు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందన
దిశ, నేషనల్ బ్యూరో: 2025 సెప్టెంబరులో 75 ఏళ్లు నిండనున్న మోడీ పదవీ విరమణ తర్వాత తన వారసుడిగా రానున్న హోం మంత్రి అమిత్ షా కోసం మోడీ ఓట్లు అడుగుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో ఉండరని, 2025 సెప్టెంబర్ వరకు దేశం వేచి ఉండాల్సిన అవసరం లేదని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత మోడీ అధికారంలో ఉండరని చెప్పారు. ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.
మోడీ ప్రసంగాల స్థాయిని తగ్గించారని, ఆయన ఉపయోగించే భాష దేశానికి మంచిది కాదని ఆరోపించారు.రాముడిపై బీజేపీకి కాపీరైట్ లేదని స్పష్టం చేశారు. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక ఆహ్వానాన్ని తిరస్కరించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని శశిథరూర్ సమర్థించారు. దేవాలయాలకు వెళ్లేది రాజకీయాల కోసం కాదని వెల్లడించారు. రాజకీయాల కోసం అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో వైఫల్యం, జనాభాలో 80 శాతం మంది ఆదాయం క్షీణించడం వంటి అంశాలపై చర్చ చేపట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.