చైనాకు చెక్.. బార్డర్‌లోనే భారత్ ఎయిర్‌పోర్ట్

by Hajipasha |   ( Updated:2024-02-10 12:51:48.0  )
చైనాకు చెక్.. బార్డర్‌లోనే భారత్ ఎయిర్‌పోర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : చైనా బార్డర్‌లో భారత సర్కారు వ్యూహాత్మకంగా ఓ నిర్మాణాన్ని చేపట్టనుంది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌‌ఏసీ)కు అత్యంత సమీపంలోని లడఖ్‌ రీజియన్‌లో నుబ్రా అనే ఏరియా ఉంది. ఆ ఏరియాలోని థోయిస్ వైమానిక స్థావరం వద్ద మూడున్నర ఎకరాల్లో కొత్తగా పౌర విమానాశ్రయం నిర్మాణ పనులను నరేంద్ర మోడీ సర్కారు ప్రారంభించనుంది. ఈ వైమానిక స్థావరం వద్దే కొత్తగా ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణానికి కన్సల్టెంట్లను నియమించడానికి బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 5,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సెంట్రల్ ఎయిర్ కండీషనింగ్‌తో థోయిస్‌ ఏరియాలో డొమెస్టిక్ ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు బిడ్ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. ఈ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.130 కోట్లు అని వెల్లడించారు. థోయిస్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాక.. అక్కడికి మరిన్ని ప్యాసింజర్ విమాన సర్వీసులను నడపాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed