- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాస్వామ్యంపై మోడీ ప్రభుత్వానిది వింత వైఖరి: మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై దృష్టి మరల్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య విషయంలో మోడీ ప్రభుత్వం వింత వైఖరిని అవలంబిస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై చర్చలు జరపడం లేదని, పార్లమెంట్ లో అంతరాయాలకు కారణమైందని ఖర్గే ఆరోపించారు.
గురువారం పార్లమెంట్ హౌజ్ నుంచి విజయ్ చౌక్ తిరంగ మార్చ్ తర్వాత ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాన్ని వాష్ ఔట్ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి చాలా మాట్లాడే ప్రభుత్వం, వాటిని అనుసరించదని అన్నారు. విపక్షాలు ఏకమై ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కొరకు పోటీ చేస్తాయని అన్నారు. పార్లమెంటుకు భంగం కలిగించేంది అధికార పార్టీనేనని, అయితే మేము డిమాండ్లను తెరపైకి తీసుకొస్తే మాట్లాడేందుకు అనుమతివ్వరని చెప్పారు.
కేవలం 2 నుంచి రెండున్నర ఏళ్లలో అదానీ సంపద రూ.12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. మెజారిటీ సభ్యులున్న బీజేపీ ఈ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. కేంద్రం కావాలనే రాహుల్ సభ్యత్వంపై మెరుపు వేగంతో అనర్హత వేటు వేసిందని అన్నారు.