ఆగస్టులో మోడీ సర్కార్ కొలాప్స్.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
ఆగస్టులో మోడీ  సర్కార్ కొలాప్స్.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆగస్టు నాటికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కుప్ప కూలడం ఖాయం అని అందువల్ల ముందస్తు ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని తమ పార్టీ శ్రేణులకు ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యావద్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ఢిల్లీలో మోడీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. ఆగస్టు నాటికి ఈ సర్కార్ పతనం కావచ్చు. ఎన్నికలకు పార్టీ రెడీగా ఉండాలని సూచించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతగా మెజార్టీ దక్కలేదు. 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించగా ఎన్డీయే కూటమి సహకారంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో త్వరలోనే అసమ్మతి నెలకొనబోతున్నదనే ప్రచారం ఇండియా కూటమి వైపు నుంచి వినిపిస్తున్నది. ఇటువంటి తరుణంలో విపక్ష కూటమిలో కీలకమైన పార్టీగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఆగస్టు సంక్షోభం గురించి ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరో వైపు బిహార్ లో 40 లోక్ సభ స్థానాలు ఉండగా జేడీయూ 12, బీజేపీ 12, ఎల్ జేపీఆర్వీ 5, ఆర్జేడీ 4, కాంగ్రెస్ 3, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 2 స్థానాలు, హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 1, ఇండిపెండెంట్ 1 చొప్పున సీట్లు గెలుపొందారు.

Advertisement

Next Story