Delhi coaching centre deaths: ‘మిస్సింగ్’ విద్యార్థి క్షేమం.. తన ఫొటో వాడవద్దని సూచన

by Shamantha N |
Delhi coaching centre deaths: ‘మిస్సింగ్’ విద్యార్థి క్షేమం.. తన ఫొటో వాడవద్దని సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్ లోని కోచింగ్ సెంటర్ లో ముగ్గురు చనిపోవడంతో అభ్యర్థులు ఇంకా నిరసకొనసాగిస్తున్నారు. మరికొందరు మిస్ అయ్యారని ఆందోళన తెలుపుతున్నారు. కాగా.. విషాదం జరిగినప్పుడు కోచింగ్ సెంటర్‌లో ఉన్న కొంతమంది విద్యార్థుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని విద్యార్థులు చెబుతున్నారు. అయితే, మిస్ అయ్యాడని చెబుతుతన్న ఓ వ్యక్తి తాను సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశాడు. తన ఫొటోను వాడటం మానేయాలని మీడియాను కోరాడు. కింగ్ స్లే కన్నన్ అనే విద్యార్థి ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌లో తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నట్లు మీడియాతో చెప్పాడు. కాగా.. ప్రమాదం జరిగినప్పుడు అతడు కోచింగ్ సెంటర్ లోనే ఉన్నాడు. అతని స్నేహితులు అతడిని వెతికేందుకు ప్రమాదస్థలానికి వెళ్లారు. అయితే, వారు అతడ్ని అక్కడ చూడలేదు. దీంతో, కింగ్ స్లే కన్నన్ మిస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

కన్నన్ ఏమన్నాడంటే?

కన్నన్ మీడియాతో మాట్లాడుతూ.. “విషాదం జరగడానికి ముందే నేను లైబ్రరీ నుంచి వెళ్లిపోయా. కానీ, నేను వెళ్లే టైంలో లైబ్రరీలో దాదాపు 22-25 మంది విద్యార్థులు కూర్చున్నారు. నా ఫొటోను వాడటం మానేయాలని మీడియాను కోరుతున్నా. తమిళనాడులోని నా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ”అని తెలిపాడు. ఇకపోతే, చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను వదిలేది లేదని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ హామీ ఇచ్చారు. దీనిపై విచారణ జరిపేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తుంది. బాధ్యులను గుర్తించి, ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చర్యలు తీసుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed