ఇజ్రాయిల్‌లో మిస్సింగ్ : స్వదేశానికి చేరుకున్న కేరళ రైతు

by Sathputhe Rajesh |
ఇజ్రాయిల్‌లో మిస్సింగ్ : స్వదేశానికి చేరుకున్న కేరళ రైతు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయిలో మిస్సింగ్ అయిన కేరళ రైతు బిజు కురియన్ సోమవారం కలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. కేరళ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని కొత్త వ్యవసాయ పద్ధతులను తెలుసుకునేందుకు ఈనెల మొదట్లో 28 మంది ప్రతినిధి బృందాన్ని అక్కడికి పంపింది. కాగా పర్యటన సందర్భంగా బిజు కురియన్ కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇజ్రాయిల్ పోలీసులతో మాట్లాడి కేసు ఫైల్ చేయించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయిల్ ప్రభుత్వం అతన్ని పట్టుకుని స్వదేశానికి పంపింది. అయితే కురియన్ వీసాను సైతం రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర మంత్రి పీ. ప్రసాద్ తెలిపారు. అయితే కురియన్ కావాలనే అక్కడే స్థిరపడాలని భావించి కనిపించకుండా పోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. తాజాగా అక్కడి ప్రభుత్వం కురియన్ ను స్వదేశానికి పంపించడం ఈ అంశానికి తెరపడింది.

Advertisement

Next Story

Most Viewed