నాగ్‌పూర్ లో మైనర్ పై దంపతుల ఘాతుకం.. ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు పెట్టి...

by Shiva |
నాగ్‌పూర్ లో మైనర్ పై దంపతుల ఘాతుకం.. ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు పెట్టి...
X

దిశ, వెబ్ డెస్క్ : నాగ్‌పూర్‌లో గృహిణిగా పని చేస్తున్న 12 ఏళ్ల మైనర్ ను ఓ జంట వేడి పాన్, వేడి కత్తి, సిగరెట్లతో చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి సొసైటీలోని దంపతుల ఇంటికి పని చేసేందుకు బాలికను బెంగళూరు నుంచి మూడేళ్ల క్రితం తీసుకొచ్చారు. ఎన్జీవో ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయి ఎలాంటి తప్పులు చేసినా యజమానులు నిత్యం వేడి పాన్ లేదా సిగరెట్‌తో మైనర్ శరీరంపై నిర్ధాక్షిణ్యంగా ముద్ర వేసేవారని ఆమె తెలిపింది. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదని బాలిక తెలిపింది.

అయితే, చిత్రహింసలు పెట్టిన దంపతులు పనిపై బెంగళూరుకు వెళ్లగా.. బాలికను వారు నాలుగు రోజులు ఇంట్లోనే ఒంటరిగా వదిలేశారు. ఈ క్రమంలోనే బాలిక కిటికీ నుంచి సాయం కోసం గట్టిగా అరుస్తుండగా.. ఇరుగు పొరుగు వారు గమనించి రెస్క్యూ చేసి బాలికను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చారు. గాయపడిన స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన వారు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా.. ఆ దంపతులు పెట్టిన చిత్రహింసలు బయట పడినట్లు పోలీసు అధికారి విక్రాంత్ సంగనే తెలిపారు. ఈ మేరకు బాలికను అదుపులోకి తీసుకుని ఆఘాయిత్యానికి పాల్పడిన దంపతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story