రాజ్య సభలో ‘మహిళా’ రగడ.. ఖర్గే వ్యాఖ్యలపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం

by Satheesh |   ( Updated:2023-09-19 11:26:44.0  )
రాజ్య సభలో ‘మహిళా’ రగడ.. ఖర్గే వ్యాఖ్యలపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ నేతల ఆందోళనతో రాజ్య సభ దద్దరిల్లింది. బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందని.. బలహీన వర్గాల వారికే టికెట్లు ఇస్తున్నారని.. వారికి పెద్దగా చదువు ఉండదని.. గట్టిగా పోరాడే మహిళలకు టికెట్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని ఏఐసీసీ చీఫ్, రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్య సభలో గందరగోళం రేపాయి. ఖర్గే ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బలహీన వర్గాల మహిళలకే టికెట్లు ఇస్తున్నారన్న ఖర్గే వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాజ్య సభ సాక్షిగా మహిళలను మల్లికార్జున ఖర్గే అవమానించారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళను దేశంలో అత్యున్నత పదవైనా రాష్ట్రపతిని చేసింది బీజేపీనే అని నిర్మలా సీతారామన్ ఖర్గేకు కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్‌ను ప్రధాని మోడీకి ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని సెటైర్ వేశారు. మొత్తానికి మహిళలపై మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ రాజ్య సభలో రగడ రేపాయి. దీంతో రాజ్య సభను చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed