మేఘాలయ, నాగాలాండ్ పోల్స్ : ఒంటి గంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

by Sathputhe Rajesh |
మేఘాలయ, నాగాలాండ్ పోల్స్ : ఒంటి గంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర భారతదేశంలోని మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒంటి గంట వరకు మేఘాలయలో 44 శాతం పోలింగ్ నమోదు కాగా నాగాలాండ్‌లో 58 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గాను ఎన్నికల కమిషన్, సెక్యూరిటీ ఎజెన్సీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

నాగాలాండ్ మొత్తం 13 లక్షల మంది ఓటర్లు ఉండగా 183 మంది 59 స్థానాల్లో పోటీ పడుతున్నారు. 2,291 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మేఘాలయలో 21లక్షల 60వేల మంది ఓటర్లు ఉండగా 3,419 పోలింగ్ బూత్ లలో పోలింగ్ ప్రక్రియ నడుస్తోంది. 59 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 369 మంది ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed