Meghalaya: మేఘాలయాలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

by vinod kumar |
Meghalaya: మేఘాలయాలో భారీ వర్షాలు.. 10 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయాలోని గారోహిల్స్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఘటనల్లో10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని దాలు వద్ద వరద నీటిలో మునిగి ముగ్గురు, సౌత్ గారో హిల్స్ జిల్లాలోని హతియాసియా సాంగ్మా గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో ఏడుగురు మృతి చెందినట్టు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గారో హిల్స్ జిల్లాపై తీవ్ర ప్రభావం పడింది. వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

దక్షిణ, పశ్చిమ గారో కొండలపై తీవ్ర ప్రభావం పడిందిని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అనేక గ్రామాలు ముంపునకు గురికావడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతంలో రెస్యూ ఆపరేషన్ చేపట్టాయి. భారీగా కొండచరియలు విరిగిపడటం వల్ల పలు గ్రామాల మధ్య కమ్యునికేషన్ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. వరద పరిస్థితిని సమీక్షించారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం అంచనా వేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా అందజేయాలని తెలిపారు. ప్రజా జీవనాన్ని సులభతరం చేయడానికి తగిన సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed