- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలింగ్ కేంద్రం సమీపంలో మావోయిస్టుల ఘాతుకం
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఘజియాబాద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రానికి సమీపంలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ బ్లాస్టింగ్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈవీఎమ్ మిషన్లు స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా ఈ బ్లాస్టింగ్ చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, సాయంత్రం ఆరు గంటలకు ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈనెల 7న తొలి విడత పోలింగ్ జరగ్గా... నేడు 70 స్థానాలకు తుది విడత పోలింగ్ చేపట్టారు. డిసెంబరు 3న ఓట్లు లెక్కించనున్నారు. ఛత్తీస్ గఢ్‌లో రెండో విడత పోలింగ్ బరిలో మొత్తం 958 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సీఎం భూపేశ్ బఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్‌తో పాటు 8 మంది రాష్ట్ర మంత్రులు, నలుగురు ఎంపీలు తుది విడత ఎన్నికల్లో పోటీ చేశారు.