ఏటా అనేక మంది యువత పరువు హత్యలకు బలి: CJI ChandraChud

by Hajipasha |   ( Updated:2022-12-18 10:01:35.0  )
ఏటా అనేక మంది యువత పరువు హత్యలకు బలి: CJI ChandraChud
X

ముంబై: భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏటా అనేక మంది యువత పరువు హత్యలకు గురవుతున్నారని అన్నారు. ముంబైలో బాంబే బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో న్యాయం నైతికత అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలో వేరు కులానికి చెందిన వారిని ప్రేమించడం లేదా పెళ్లి చేసుకోవడంతో అనేక మంది యువత పరువు హత్యలకు గురవుతున్నారని అన్నారు. 'బలహీన, అట్టడుగున ఉన్న సభ్యులకు తమ మనుగడ కోసం ఆధిపత్య సంస్కృతికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అణచివేత గ్రూపుల చేతిలో అవమానం, వేర్పాటు కారణంగా సమాజంలోని బలహీన వర్గాలు ప్రతివాద సంస్కృతిని సృష్టించలేకపోతున్నాయి.

అయితే ఏదైనా బలహీన సమూహాలు అభివృద్ధి చెందితే వారిని మరింత దూరం చేయడానికి ప్రభుత్వ గ్రూపులు ఉన్నాయి' అని సీజేఐ అన్నారు. బలహీన వర్గాలను సామాజిక నిర్మాణంలో దిగువన ఉంచారని చెప్పారు. పురాణాల్లో కూడా ఇదే ఉందని తెలిపారు. ఒకరి విషయంలో న్యాయంగా ఉంది మరోకరి విషయంలోనూ న్యాయంగా ఉందా అని సీజేఐ ప్రశ్నించారు. 1991లో కన్నవారి చేతిలో పరువు హత్యకు 15 ఏళ్ల బాలిక విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి సమాజానికి తగ్గట్లుగా అది సరైన చర్య కావచ్చు. చట్టం ప్రకారం ఇది దారుణమైన నేరమని చెప్పారు. ఇదే విషయాన్ని కొన్ని రోజులకు గ్రామస్థులు కూడా అంగీకరించారని చెప్పారు.


Advertisement

Next Story