- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రిలో భార్యను పరామర్శించిన మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను కలిసేందుకు సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. అయితే.. సిసోడియా తన ఇంటికి వెళ్లే సరికి ఆయన భార్య ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన తన భార్యను ఆస్పత్రికి వెళ్లి చూశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 5 గంటల వరకు తన భార్యతో కలిసేందుకు సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
ఆయన తన కుటుంబ సభ్యులను మినహా మరెవరినీ కలవకూడదని, మీడియాతోనూ మాట్లాడరాదని, ఫోన్, ఇంటర్నెట్ ను వాడరాదని కండిషన్ విధించింది. దీంతో ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్న సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
సబ్ కా సాథ్ నహీ.. బ్రిజ్ భూషణ్ కా సాథ్: కపిల్ సిబల్ సెటైర్లు