Manipur Violence: 'తీవ్ర దిగ్భ్రాంతి చెందాం'.. ‘నగ్న ఊరేగింపు’ ఘటనపై యూఎస్ స్పందన

by Vinod kumar |
Manipur Violence: తీవ్ర దిగ్భ్రాంతి చెందాం.. ‘నగ్న ఊరేగింపు’ ఘటనపై యూఎస్ స్పందన
X

ఇంఫాల్ : మణిపూర్‌లో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించిన వ్యవహారంపై అమెరికా స్పందించింది. ఈ వీడియో చూసి అమెరికా తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, బాధితులకు న్యాయం చేసేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై ఒక పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బదులిస్తూ.. "ఏ నాగరిక సమాజంలోనైనా మహిళలపై ఇలాంటి హింస సిగ్గుచేటు అని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు" అని వ్యాఖ్యానించారు. "చర్చలతో మణిపూర్‌లో హింసను ఆపాలి. అన్ని వర్గాల జీవితాలను, ఆస్తులను రక్షించాలి" అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story