Manipur violence: సీబీఐ చేతికి మరో 9 మణిపూర్ కేసులు..

by Vinod kumar |
Manipur violence: సీబీఐ చేతికి మరో 9 మణిపూర్ కేసులు..
X

ఇంఫాల్‌ : మణిపూర్ హింసాకాండలో మహిళలపై నేరాలు, లైంగిక దాడులకు సంబంధించిన కేసులను సీబీఐ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. గతంలోనే సీబీఐకి ఈ తరహా 8 కేసులను అప్పగించగా.. తాజాగా మరో 9 కేసులను బదిలీ చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు కూడా ఈ లిస్టులో చేరుతాయని అంటున్నారు. ఇప్పటివరకైతే సీబీఐకి అప్పగించిన కేసుల సంఖ్య 17కు చేరింది. చురాచంద్‌పుర్‌ జిల్లాలో చోటు చేసుకున్న మరో లైంగిక వేధింపుల కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. మణిపూర్ కు పంపే అధికారుల ఎంపికలో సీబీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.

సీబీఐ మహిళా అధికారులను కొన్ని టీమ్స్‌గా ఏర్పాటు చేసింది. బాధితుల స్టేట్‌మెంట్‌ నమోదు చేయడం, అనుమానితులను ప్రశ్నించడం తదితర విషయాల్లో వారి సేవలను వినియోగించుకుంటోంది. సీబీఐ విచారిస్తున్న చాలా కేసులు షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల (అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధినవి ఉన్నాయి. వీటిని డీఎస్పీ స్థాయి ర్యాంక్‌ అధికారి విచారిస్తారు. అలా కుదరని పక్షంలో సీబీఐ ఎస్పీలు ఈ కేసులను పర్యవేక్షించే అవకాశం ఉంది. సీబీఐ సేకరిస్తున్న అన్ని రకాల ఫోర్సెనిక్‌ శాంపిళ్లను సెంట్రల్‌ ఫోర్సెనిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీకి పంపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed