మణిపూర్‌లోని 11 బూత్‌లలో రీ పోలింగ్

by S Gopi |
మణిపూర్‌లోని 11 బూత్‌లలో రీ పోలింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోలోని ఇన్నర్‌ మణిపూర్‌లో ఈ నెల 19న జరిగిన పోలింగ్‌లో 11 పోలింగ్‌ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సోమవారం(22న) ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, కేంద్రాల వద్ద ఓట్లర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 73.05 శాతం ఓటింగ్ నమోదైంది. రీపోలింగ్ నిర్వహించిన పోలింగ్ స్టేషన్లలో ఖురాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు, క్షేత్రీగావ్‌లో నాలుగు, థోంగ్జూలో ఒకటి, ఉఠిపోక్‌లో మూడు, కౌంతౌజామ్ ఉన్నాయి. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతవారం జరిగిన తొలి దశలో కొందరు దుండగులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కాల్పులు జరిపి ఈవీఎంలను ధ్వ్మసం చేశారు. ఔటర్ మణిపూర్‌లోని మిగిలిన 13 సెగ్మెంట్‌లకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఏప్రిల్ 19న మణిపూర్‌లో 69.18 శాతం ఓటింగ్ నమోదైంది.

Advertisement

Next Story