Sukhbir Singh Badal: స్వర్ణదేవాలయం వద్ద కాల్పులు.. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం

by Shamantha N |
Sukhbir Singh Badal: స్వర్ణదేవాలయం వద్ద కాల్పులు..  పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోని స్వర్ణదేవాలయం దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి. పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్(Shiromani Akali Dal) ) నాయకుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) పై కాల్పులు జరిగాయి. అకాల్ తఖ్త్(Akal Takht) విధించిన శిక్షను అనుభవించేందుకు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం దగ్గరకు రెండో రోజు వెళ్లిన సుఖ్ బీర్ వెళ్లారు. అయితే, స్వర్ణదేవాలం ప్రవేశ ద్వారం దగ్గర మెడలో పలక తలిగించుకుని వేచి ఉండగా తుపాకీతో ఆయన సమీపానికి దుండగుడు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, బాదల్ అనుచరులు అతడ్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో, తుపాకీ గాల్లో పేలింది. నిందితుడ్ని దల్ ఖల్సాకు చెందిన నారాయణ్ సింగ్ చోర్హాగా గుర్తించారు. అతడ్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు.

అకాల్ తఖ్త్ శిక్ష

ఇకపోతే, సుఖ్ బీర్‌ సింగ్‌ బాదల్‌కు అకాల్‌ తఖ్త్‌ (Akal Takht) పలు శిక్షలు విధించింది. ఈ క్రమంలోనే ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో (Golden Temple) సేవాదార్‌(కాపలాదారుడు)గా శిక్షను అనుభవిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం కూడా వీల్‌చైర్‌లో స్వర్ణ దేవాలయానికి వచ్చిన ఆయన ప్రవేశద్వారం వద్ద మెడలో పలకను ధరించి, చేతిలో ఈటెను పట్టుకొని సేవాదర్‌ శిక్షను అనుభవిస్తున్నారు. శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్ బీర్‌ సింగ్‌ బాదల్‌ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్‌ నిర్ధరించింది. ఈ విషయంలో పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చారు. తాను చేసిన తప్పులను అంగీకరించిన సుఖ్‌బీర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు శిక్ష విధఇంచింది. అంతేకాకుండా ఆయన తండ్రి పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన బిరుదును (Fakhre-e-Qaum) కూడా ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed