- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GST: జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగించండి: మమతా బెనర్జీ
దిశ, నేషనల్ బ్యూరో: జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం వస్తు, సేవల పన్ను( జీఎస్టీ) తొలగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై పన్ను కారణంగా వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ విధానాన్ని సమీక్షించాలని కోరుతూ మమతా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ఇవి ఊహించని సమయాల్లో ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగిన సమయాల్లో బాధిత కుటుంబాలకు కష్టాలను కొంత వరకు తీర్చడంలో ఈ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిపై జీఎస్టీ విధించడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతుందని బెనర్జీ అన్నారు. ఈ అదనపు భారం చాలా మంది వ్యక్తులకు కొత్త పాలసీలు తీసుకోకుండా లేదా ఇప్పటికే ఉన్న బీమా కవరేజీని కొనసాగించకుండా అడ్డుపడుతుంది. దాంతో వారు ఊహించని ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని ఆమె తన లేఖలో రాశారు. బీమా పాలసీలు, ప్రీమియంలపై 18 శాతం పన్ను విధించడంపై పలువురు ప్రతిపక్ష నేతలు ఇటీవల విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.