ఇండియాలో మాల్దీవ్స్ అధ్యక్షుని పర్యటన

by M.Rajitha |
ఇండియాలో మాల్దీవ్స్ అధ్యక్షుని పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియాలో పర్యటన నిమిత్తం మాల్దీవ్స్ అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం మహ్మద్ మొయిజ్జు సతీ సమేతంగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా.. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కిరీటి వరధాన్ సింగ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు అక్టోబర్ 6 నుండి 10 వరకు భారత్ లో పర్యటించనున్న మహ్మద్ మొయిజ్జు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీలతో సమావేశం కానున్నారు. కాగా ఇటీవలే మరోసారి మాల్దీవ్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహ్మద్ మొయిజ్జు.. భారత్ తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు. భారత్ లో పర్యటించడం వల్ల ఇరు దేశాల మధ్య మరింత స్నేహపూర్వక ఒప్పందాలకు బాటలు వేసినట్టు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed