షిండేతో టచ్‌లో 33 మంది ఎమ్మెల్యేలు.. మంత్రి ఉదయ్ సామంత్

by Vinod kumar |
షిండేతో టచ్‌లో 33 మంది ఎమ్మెల్యేలు.. మంత్రి ఉదయ్ సామంత్
X

ముంబయి: మహారాష్ట్రలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండేను తప్పించి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కట్టబెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఇటీవల వార్తలొచ్చాయి. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేనకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నారంటూ ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ బాంబు పేల్చారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా షిండేతో రహస్యంగా చర్చలు జరిపారని తెలిపారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అస్థిరత తప్పదా..? అనే అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేశారు. 288 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర అసెంబ్లీలో 145 మంది ఎమ్మెల్యేల మద్దతు సాధించిన వారికే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

షిండేతో టచ్‌లో 33 మంది ఎమ్మెల్యేలు.. మంత్రి ఉదయ్ సామంత్

మరోవైపు అజిత్ పవార్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని, 20 మంది ఎమ్మెల్యేలతో ఎన్సీపీని చీల్చి బీజేపీ చంకన చేరేందుకు సిద్ధమయ్యారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ వార్తలను అజిత్ పవార్ ఖండించారు. కానీ, ముఖ్యమంత్రి పదవి తమ చేతిలో ఉంటేనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో, తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించగలమని, దేవేంద్ర ఫెడ్నవీస్‌కు సీఎం పదవి అప్పగించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే ఈ ఆపరేషన్ కు తెర లేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed