- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహారాష్ట్ర మంత్రికి రెండేళ్ల జైలు శిక్ష

- 30 ఏళ్ల క్రితం కేసులో దోషిగా మాణిక్ రావు కోకఠే
- కొకాఠే సోదరులను దోషులుగా తేల్చిన సెషన్స్ కోర్టు
- బెయిల్ తెచ్చుకున్న మాణిక్ రావు కోకఠే
దిశ, నేషనల్ బ్యూరో: 30 ఏళ్ల నాటి మోసం, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్ కేసులో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్ రావు కోకఠేకు నాసిక్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మాణిక్ రావు, ఆయన సోదరుడు సునిల్ కోకఠే సీఎం కోటా కింద నిర్మాణ్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్స్ మోసపోరితంగా పొందారంటూ 1995లో మాజీ మంత్రి, దివంగత టీఎస్ డిఘాలే ఫిర్యాదు చేశారు. దీంతో కొకాటే సోదరులపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘంగా జరిగిన ఈ విచారణలో 10 మంది సాక్షులను కోర్టు విచారించింది. చివరకు కోకఠే సోదరులను దోషులుగా తేల్చుతూ గురువారం శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది. కోకఠేతో పాటు ఆయన సోదరుడినికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.
తమకు సొంత ప్లాట్లు లేవని, తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందిన వారమంటూ కోకఠే సోదరులు యోలాకర్ మాలలోని కాలేజ్ రోడ్‌లో రెండు ప్లాట్లను పొందారు. ముఖ్యమంత్రి తన కోటా కింద ఎల్ఐజీలో 10 శాతం ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని నకిలీ పత్రాలతో రెండు ప్లాట్లను పొందారు. కాగా, నాసిక్ కోర్టు ఈ కేసులో కోకఠే సోదరులను దోషులుగా తేల్చగా.. మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరైందని, తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును పై కోర్టులో అప్పీల్ చేస్తానని మాణిక్ రావు కోకఠే మీడియాకు తెలిపారు.
వ్యవసాయ మంత్రిగా ఉన్న మాణిక్ రావు కోకఠే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు రూపాయి పంట బీమా పథకం అమలుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. బిచ్చగాళ్లు కూడా రూపాయి వేస్తే భిక్షం తీసుకోరు. కానీ తమ ప్రభుత్వం మాత్రం రూపాయికే పంట బీమా ఇస్తోందని, కానీ చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రూపాయి పంట బీమా కింద 4 లక్షల కంటే ఎక్కువ పంట బీమా దరఖాస్తులు మోసపూరిత క్లెయిమ్‌ల కారణంగా తిరస్కరించబడ్డాయని చెప్పారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలు చేసి ఐదు రోజులు కాకుండానే ఆయనకు మోసం కేసులో శిక్ష పడటం గమనార్హం.