మరోసారి వివాదంలో గవర్నర్.. అమరవీరులను అవమానించారంటూ కాంగ్రెస్ ఫైర్!

by Satheesh |   ( Updated:2022-11-26 15:39:09.0  )
మరోసారి వివాదంలో గవర్నర్.. అమరవీరులను అవమానించారంటూ కాంగ్రెస్ ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్‌యారి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీని 'ఓల్డెన్ డేస్' ఐకాన్ అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, శరత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ వివాదం మహారాష్ట్ర పొలిటికల్ సరిల్స్‌లో పూర్తిగా సద్ధుమణగక ముందే.. గవర్నర్ కోష్‌యారి మరో వివాదంలో చిక్కుకున్నారు. సౌత్ ముంబైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అమరవీరుల స్మారకం వద్ద 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించే క్రమంలో గవర్నర్ కాళ్లకు పాదరక్షలు వేసుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

కాళ్లకు చెప్పులు వేసుకుని అమరవీరులకు నివాళులర్పించడంపై కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మండిపడ్డాయి. ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాన్లను గవర్నర్ అవమానపరిచారని విమర్శలు గుప్పించాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ తీవ్రంగా మండిపడ్డారు. పాదరక్షలు తీసివేసి శ్రద్ధాంజలి ఘటించడం భారతీయ సంస్కృతి అని.. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర సంస్కృతని.. కానీ గవర్నర్ మరోసారి మహారాష్ట్ర సంస్కృతిని, మహారాష్ట్ర ప్రముఖులను అవమాన పర్చారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాల్ని పదే పదే దెబ్బ తీస్తున్న గవర్నర్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed