- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాళ్లు కడిగిన వ్యక్తి అతడు కాదా?.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
దిశ, వెబ్ డెస్క్: 10 రోజుల కిందట మధ్యప్రదేశ్ కు చెందిన ఓ గిరిజన వ్యక్తిపై ప్రవేశ్ శుక్లా అనే మూత్ర విసర్జన చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. నిందితుడిని అరెస్ట్ చేయించి బాధితుడైన దశ్మత్ రావత్ ను సీఎం కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అనంతరం అతడి కాళ్లను నీళ్లతో కడిగిన సీఎం క్షమాపణ కోరాడు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సీఎం కాళ్లు కడిగిన వ్యక్తి ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసి వ్యక్తి ఒకటి కాదని.. వారిద్దరూ వేరంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
వారిద్దరిని దగ్గరి నుంచి గమనిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుందని సోషల్ మీడియా యూజర్లు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీడియోలో కనిపించిన వ్యక్తి 16 నుంచి 19 ఏళ్లకు మించి ఉండరని కానీ.. సీఎం కాల్లు కడిగిన వ్యక్తి మాత్రం 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణ చేసింది. "శివరాజ్ వేరొకరి కాళ్లు కడిగి డ్రామా చేశారు. అసలు బాధితుడు కనిపించకుండా పోయాడా? శివరాజ్ జీ.. మరీ ఇంత పెద్ద కుట్రనా? మధ్యప్రదేశ్ మిమ్మల్ని క్షమించదు" అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్ లో విమర్ళు గుప్పించింది. ఇక ఈ విషయమై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, బాధితుడు దశ్మత్ రావత్ నోరు విప్పితే తప్ప ఈ ఆరోపణలకు ముగింపుపడేలా లేదు.