- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విపక్షాల మీటింగ్‌కు పార్టీల అధ్యక్షులే రావాలి : సీఎం
పాట్నా: పాట్నా వేదికగా జూన్ 12న జరగాల్సిన విపక్ష పార్టీల సమావేశాన్ని వాయిదా వేయడానికి గల ముఖ్య కారణాన్ని ఆ మీటింగ్ నిర్వాహకుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. పార్టీల అధ్యక్ష స్థానంలో ఉన్నవారే మీటింగ్‌కు హాజరుకావాలనే ఒకే ఒక్క అంశం కోసం మీటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. సోమవారం పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివరాలను వెల్లడించారు. "కొన్ని పార్టీల అధ్యక్షులకు జూన్ 12న ఇతరత్రా పనులు ఉన్నందున.. ఇతర నాయకులను మీటింగ్‌కు పంపుతామని చెప్పారు. అయితే మేం దానికి ఒప్పుకోలేదు.
పార్టీల అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలనే దానికి కట్టుబడి ఉన్నాం.. అన్ని విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక తేదీలో త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తాం" అని నితీష్ వెల్లడించారు. జూన్ 12న ఇతరత్రా మీటింగ్‌లు ఉన్నందున ఆ రోజు పాట్నాకు రాలేమని కాంగ్రెస్, డీఎంకే పార్టీల అధ్యక్షులు తనతో చెప్పరాని పేర్కొన్నారు. దీంతో ఇతర విపక్ష పార్టీలతో మాట్లాడి మీటింగ్ నిర్వహించేందుకు ఇంకో డేట్ ను సూచించాలని కాంగ్రెస్ పార్టీని కోరానన్నారు. "ఉదాహరణకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాకుండా ఇంకొక వ్యక్తిని పంపుతానని చెప్పిందనుకోండి. దానికి కూడా మేం ఒప్పుకోము" అని నితీష్ స్పష్టం చేశారు.