Maayavathi: బీజేపీ ప్రభుత్వం బుజ్జగింపులకు పాల్పడుతోంది.. బీఎస్పీ చీఫ్ మాయవతి

by vinod kumar |
Maayavathi: బీజేపీ ప్రభుత్వం బుజ్జగింపులకు పాల్పడుతోంది.. బీఎస్పీ చీఫ్ మాయవతి
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ డిసిషన్ రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలు రాజకీయంగా, ఎన్నికల పరంగా ఓ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ పరిధిలో మాత్రమే పనిచేయాలని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ఉద్యోగులు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. కాబట్టి కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదని దీనిని వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదిలు సైతం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం సిగ్గేచేటని అభివర్ణించారు. కాగా, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై నిషేధం ఉండగా దానిని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed