CJI : సుదీర్ఘ కోర్టు కేసులు శిక్షలా పరిణమిస్తున్నాయ్ : సీజేఐ చంద్రచూడ్

by Hajipasha |
CJI : సుదీర్ఘ కోర్టు కేసులు శిక్షలా పరిణమిస్తున్నాయ్ : సీజేఐ చంద్రచూడ్
X

దిశ, నేషనల్ బ్యూరో : సుదీర్ఘకాలం పాటు కొనసాగే కోర్టు కేసులు తరుచుగా పిటిషనర్ల పాలిట శిక్షలా పరిణమిస్తుంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విసిగివేసారిపోయే పిటిషనర్లు గత్యంతరం లేక సెటిల్‌మెంట్లకు మొగ్గుచూపుతుంటారని ఆయన పేర్కొన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టులో వారం పాటు స్పెషల్ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సీజేఐ చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

పెండింగ్ కేసులకు సామరస్య పూర్వక పరిష్కారాన్ని అందించడంలో లోక్ అదాలత్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. లోక్ అదాలత్‌లకు సంబంధించిన ప్రతీ ప్యానల్‌లో ఇద్దరు జడ్జీలు, ఇద్దరు బార్ సభ్యులు తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. లోక్ అదాలత్‌లు కేవలం జడ్జీలు నిర్వహించే సంస్థలు కావనే సందేశాన్ని ఇచ్చేందుకే వాటిలో బార్ సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తుంటారని సీజేఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story