ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొమ్మిదో లిస్ట్

by Hajipasha |
ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొమ్మిదో లిస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఐదుగురు లోక్‌సభ అభ్యర్థులతో తొమ్మిదో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. కర్ణాటకలోని మూడు, రాజస్థాన్‌లోని రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కర్ణాటకలోని బళ్లారి స్థానాన్ని ఈ.తుకారాంకు, చామరాజనగర్‌ను సునీల్ బోస్‌కు, చిక్ బళ్లాపూర్‌ను రక్షా రామయ్యకు కేటాయించింది. ఇక రాజస్థాన్‌లోని భిల్వారా స్థానాన్ని సీపీ జోషికి, రాజ్‌సమంద్ టికెట్‌ను దామోదర్ గుర్జర్‌కు ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 213కు చేరింది.

Advertisement

Next Story

Most Viewed