- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల నగారా : ఏయే దశలో.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుందో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 19న దేశంలోని 102 లోక్‌సభ స్థానాలకు తొలి విడత పోలింగ్, చివరగా ఏడో విడతలో జూన్ 1న 57 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. నాలుగో విడతలో భాగంగా మే 13న ఏపీలోని 25, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.
7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు ఇలా..
దశలు - పోలింగ్ తేదీ - లోక్‌సభ స్థానాలు
1 - ఏప్రిల్ 19 - 102
2 - ఏప్రిల్ 26 - 89
3 - మే 7 - 94
4 - మే 13 - 96
5 - మే 20 - 49
6 - మే 25 - 57
7 - జూన్ 1 - 57
**********************
7 విడతల పోలింగ్ షెడ్యూల్స్ ఇవీ..
* లోక్‌సభ తొలి దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
* లోక్‌సభ రెండో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
* లోక్‌సభ మూడో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ: మే 7
* లోక్‌సభ నాలుగో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ: మే 13
* లోక్‌సభ ఐదో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్ తేదీ: మే 20
* లోక్‌సభ ఆరో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: ఏప్రిల్ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్ తేదీ: మే 25
* లోక్‌సభ ఏడో దశ పోల్స్ షెడ్యూల్
నోటిఫికేషన్: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్ తేదీ: జూన్ 1
******************************
ఏయే దశలో.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ?
* ఏప్రిల్ 19 తొలిదశ (21 రాష్ట్రాలు /యూటీ - 102 స్థానాలు) : తమిళనాడు (39), రాజస్థాన్ (12), మధ్యప్రదేశ్ (6), అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోని చెరో 5 స్థానాలు, బిహార్(4), అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ చెరో 2 స్థానాలు, ఛత్తీస్ గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి చెరో లోక్‌సభ స్థానంలో పోలింగ్ జరుగుతుంది.
* ఏప్రిల్ 26 రెండో దశ (13 రాష్ట్రాలు/యూటీ - 89 స్థానాలు) : కేరళ (20), కర్ణాటక (14), రాజస్థాన్ (13), మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ చెరో 8 స్థానాలు, మధ్యప్రదేశ్ (7), అసోం, బిహార్ చెరో 5 స్థానాలు, ఛత్తీస్ గఢ్, బెంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, జమ్మూ కశ్మీర్, మణిపూర్, త్రిపురలోని చెరొక స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
* మే 7 మూడో దశ (12 రాష్ట్రాలు/యూటీ - 94 స్థానాలు) : గుజరాత్ (26), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), యూపీ (10), మధ్యప్రదేశ్ (8), ఛత్తీస్‌గఢ్ (7), బిహార్ (5), అసోం, బెంగాల్‌లోని చెరో 4 స్థానాలు, గోవా, దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యులకు చెందిన చెరో 2 స్థానాలు, జమ్మూకశ్మీర్ (1) స్థానానికి పోలింగ్ జరుగుతుంది.
* మే 13 నాలుగో దశ (10 రాష్ట్రాలు/యూటీ - 96 స్థానాలు) : ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), యూపీ (13), మహారాష్ట్ర(11), పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ చెరో 8 స్థానాలు, బిహార్ (5), జార్ఖండ్, ఒడిశా చెరో 4 స్థానాలు, జమ్మూకశ్మీర్ 1 స్థానానికి పోలింగ్ జరుగుతుంది.
* మే 20 ఐదో దశ (8 రాష్ట్రాలు/యూటీ - 49 స్థానాలు) : యూపీ (14), మహారాష్ట్ర (13), పశ్చిమ బెంగాల్ (7), ఒడిశా, బిహార్ చెరో 5 స్థానాలు, జార్ఖండ్ (3), జమ్మూకశ్మీర్, లడఖ్ చెరొక లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
* మే 25 ఆరో దశ (7 రాష్ట్రాలు/యూటీ - 57 స్థానాలు) :యూపీ(14), హర్యానా (10), బిహార్, పశ్చిమ బెంగాల్ చెరో 8 స్థానాలు, ఢిల్లీ(7), ఒడిశా (6), జార్ఖండ్ (4) స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
* జూన్ 1న ఏడో దశ (8 రాష్ట్రాలు/యూటీ - 57 స్థానాలు) : పంజాబ్, యూపీలోని చెరో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్ (9), బిహార్ (8), ఒడిశా (6), హిమాచల్ ప్రదేశ్ (4), జార్ఖండ్ (3), చండీగఢ్ (1) స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.