BREAKING: లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్

by Satheesh |
BREAKING: లోక్ సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో తొలి విడత లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తొలి విడత ఎలక్షన్‌కు ఈ నెల 27 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన.. 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19న తొలిదశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 16న కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరగనుంది. అందులో భాగంగా ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. దీంతో ఈసీ ఇవాళ తొలి విడత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న నాలుగవ దశలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed