వైన్‌ షాప్‌లో అగ్ని ప్రమాదం.. రూ 5 కోట్ల మద్యం ఆవీరి

by Mahesh |   ( Updated:2023-05-14 09:46:36.0  )
వైన్‌ షాప్‌లో అగ్ని ప్రమాదం.. రూ 5 కోట్ల మద్యం ఆవీరి
X

దిశ, వెబ్‌డెస్క్: వైన్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి సుమారు 5 కోట్ల విలువైన మద్యం ఆవిరైపోయింది. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో.. గోల్ఫ్ కోర్స్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి. ఈ ప్రమాదంలో 5 కోట్ల విలువైన మద్యం అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ మద్యం వలన మంటలు అధికంగా మారడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Also Read..

కేరళ స్టోరీస్ డైరెక్టర్ కు అనారోగ్యం

Advertisement

Next Story